ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సింది.గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు హయంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాటి పరిష్కారం కోసం పోరాడి వారికి అండగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
See Also:వైసీపీలోకి టీడీపీ ఎంపీ ..జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ..వైసీపీ ఎమ్మెల్యే..
ఈ తరుణంలో గత నలబై ఏండ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీను ఏలుతున్న ప్రముఖ స్టార్ హీరో ,కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు.ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్థానానికి చెందిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు మోహన్ బాబు.ఈ ఇంటర్వ్యూ లో ఇటివల మీరు తొంబై ఐదు శాతం మంది రాజకీయ నాయకులు పనికిరాని వారన్నారు.
See Also:కడప నగరంలో సంచలనం ..టీడీపీకి 10 మంది కార్పొరేటర్లు రాజీనామా ..
మరి ఏపీ ప్రజలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు న్యాయం చేస్తారని మీరు నమ్ముతున్నారు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా మోహన్ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు భ్రష్టు పట్టాయి.ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీలో చేరుతున్నారు.చేరడమే కాకుండా ఏకంగా మంత్రులుగా భాద్యతలు నిర్వహిస్తున్నారు.అట్లాంటి నాయకులను ఎన్నుకున్నందుకు ఏపీ ప్రజలు సిగ్గు పడాలి.ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పా ఎవరు న్యాయం చేయలేరని ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడంతో అవాక్కు అవడం ఆ మీడియా ఛానల్ అధినేత వంతైంది.