వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా.. జగన్ తన ప్రజా సంకల్పపాదయాత్ర వెయ్యి కిలో మీటర్లు దాటింది. ఇక ప్రతి శుక్రవారం వచ్చే కోర్టు హాలిడే తప్పితే ఇప్పటివరకు జగన్ 79 రోజులు నడిచారు. జగన్ తన పాదయాత్ర ముహూర్తం సాక్షాత్తు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామితో పెట్టించుకున్నారంట. ఈ విషయం స్వయంగా ఆ స్వామినే ఈ విషయాన్నీ వెల్లడించారు. విశాఖ కేంద్రంగా రాజకీయాలు చేసే టి. సుబ్బరామిరెడ్డి మద్దతుతో బాగా పాపులరైన స్వరూపానంద తరచు రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ టీడీపీని ఇరుకున పెడుతూ జగన్‌కు మద్దత్తు ఇస్తూ ఉంటారు. జగన్ క్రిస్టియన్ అయినా ఆయనలో నిజమైన హిందువును చూసానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఏముహుర్తాన జగన్ పాదయాత్రిక ముహుర్తం పెట్టారో గానీ జగన్ అడుగు ఆగడంలేదు.. రోజురోజుకీ జోరు పెరుగుతుందే గానీ.. ఒక్కసారి కూడా వెనకడుగు వేయడంలేదు. ఇప్పటికే నాలుగు జిల్లాలు పూర్తి చేసుకొని ఐదో జిల్లాలో పాదయత్ర చేస్తున్న జగన్‌కి మిగతా జిల్లాల్లో కూడా జనం బ్రహ్మరథం పట్టడం ఖాయమని రానున్నరోజులు జగన్‌వే అని స్వామిగారు అన్నారు.
