ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి సంచలనానికి కేంద్ర బిందువయ్యారు.ఇటివల ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీమంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుక్రిష్ణమ నాయుడుతెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరంతో భాదపడుతూ మరణించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు అంత్యక్రియలు వెంకట్రామపురంలో ముగిశాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు పుల్లారావు, దేవినేని ఉమ, అమర్‌నాథ్‌రెడ్డి, అచ్చెన్నాయుడు హాజరుకాగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు భూమన కరుణాకర్ రెడ్డి,నారాయణ స్వామి ముద్దుక్రిష్ణమ నాయుడు పార్దివ దేహాన్ని మోసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.అంతే కాకుండా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్సీ ముద్దు కృష్ణమ నాయుడుకి అశ్రునయనాలతో ఒక కవిత కూడా రాశారు .ఇప్పుడు అది సోషల్ మీడియాలో హాల్ చేస్తుంది.