Breaking News
Home / SLIDER / కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసిన ఎంపీ వినోద్

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసిన ఎంపీ వినోద్

కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ ఇవాళ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు.తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన నగదు కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.రాష్ట్రంలో అనేకచోట్ల ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు పెడుతున్నారని తెలిపారు . నగదు కొరత వల్ల వేతన జీవులు, పెన్షనర్లు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ వినోద్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ లో నగదు కొరతను తీర్చాలని ఆయన కోరారు.