వైసీపీ అధినేత జగన్ వరుస ప్రకటనలు ఏపీ రాజకీయాల్ని రసవత్తరంగా మార్చేశాయి. ఏపీ ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఏప్రిల్ 5వ తేదీన లోక్ సభ ఎంపీలు రాజీనామాలు చేస్తారని జగన్ ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. జగన్ అనూహ్య ప్రకటనతో ఏపీ రాజకీయాలు రంజుగా మారగా.. జగన్ మరో ప్రకటన చేసి రచ్చలేపారు. కేంద్రం పై అవిశ్వాసం పెట్టేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని.. టీడీపీ కూడా సిద్ధమా అంటూ చంద్రబాబు సర్కార్‌కి మరో సంచలన సవాల్ విసిరి టీడీపీని పూర్తిగా డిఫెన్స్‌లోకి నెట్టేశాడు జగన్.
See Also:వైసీపీ ఫిరాయింపు ఎంపీ గీతకు ఘోర అవమానం …!
అయితే తాజాగా వైసీపీ మరో సంచలనానికి తెరలేపిందనే వార్త రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్ అవుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సంచలన నిర్ణయం తీసుకోనున్నారని.. ప్రత్యేకహోదా కోసం ఎంపీల రాజీనామాతో పాటు… తాము కూడా రాజీనాలు చేస్తే ఎలా ఉంటుంది.. అనే ప్రతిపాదనని గుంటూరు జిల్లా మంగలగిరి ఎమ్మెల్యే.. ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తెర పైకి తెచ్చారట. దీంతో ఆ చర్చాలో పాల్గొన్న కొందరు వైసీపీ ఎమ్మేల్యేలు కూడా పాజిటీవ్‌గా స్పందించారని తెలుస్తోంది.
SeeAlsoమాస్టర్ ప్లాన్‌తో టీడీపీకి.. ఊపిరాడనివ్వకుండా జూలు విదిల్చిన జగన్..!
మార్చిలో మొదలవ్వబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత తాము కూడా రాజీనామాలు చేస్తే బాగుంటుందంటూ చర్చలు జరుగుతున్నాయి. రాజీనామాలు చేయబోయే రోజు అసెంబ్లీకి అందరూ హాజరై తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు అందచేయాలన్న చర్చ జరుగుతోంది. ఇక త్వరలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల తర్వాత రాజీనామాలు చేస్తే బాగుంటుందని కొందరు ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. దీంతో ఈనెలాఖరులో జగన్‌తో జరగబోయే సమావేశంలో ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే గనుగ జరిగితే ఏపీ రాజకీయాల్లో ఇంతకంటే సంచలనం మరొకటి ఉండదని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.