రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అనూహ్య ప్రశంస దక్కింది. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సహా నాస్కాం ఇండియా లీడర్‌షిప్ ఫోరం సదస్సులను ఏకకాలంలో విజయవంతంగా నిర్వహించారని నాస్కాం కాబోయే అధ్యక్షురాలు దేవ్యాని ఘోష్ ప్రసంశించారు. మంత్రి కేటీఆర్ సహా ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ సారథ్యంలోని బృందం కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈ సదస్సులు విజయవంతం అయ్యాయని ఓ ట్వీట్‌లో ఆమె ప్రశంసించారు.దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ నాస్కాం బాధ్యులు, వారి బృందం చేసిన కృషి వల్లే ఈ సదస్సులు విజయవంతం అయ్యాయని తెలిపారు. తెలంగాణకు ఇదే రీతిలో సహాయ సహకారాలు అందించాలని కోరారు.
see also: ఎల్లో గ్యాంగ్ మైండ్ బ్లాక్ అయ్యేలా షేర్లు చేయండి..!