దాదాపు ఐదు దశాబ్దాలు పాటు ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు హింది తమిళం అంటూ భాషలతో సంబంధం లేకుండా ..కోలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ ప్రాంతాలతో తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న అతిలోక సుందరి సీనియర్ నటి ..దాదాపు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించిన హీరోయిన్ శ్రీదేవి కపూర్.
See Also:టాలీవుడ్ లో ఉన్న ప్రస్తుత హీరోలలో శ్రీదేవికిష్టమైన హీరో ఎవరంటే ..!
దుబాయిలో తన కజీన్ వివాహమోత్సవానికి హాజరైన ఆమె శనివారం రాత్రి పదకొండున్నరకు గుండెపోటు రావడంతో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ శోక సంద్రంలో మునిగిపోయారు.ఈ క్రమంలో శ్రీదేవి మరణాన్ని కూడా వదిలిపెట్టలేదు వందల ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ.అసలు విషయానికి శ్రీదేవి మరణానికి అందరు ఘనంగా నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
See Also:శ్రీదేవి గురించి ఈ విషయం మీకు తెలుసా ..!
అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా నివాళులు అర్పిస్తూ తనకు పద్మశ్రీ అవార్డు మా హయంలోనే వచ్చిందని ఏకంగా ట్వీట్ చివర్లో పేర్కొన్నది.దీనిపై నెటిజన్లు ఆఖరికి శ్రీదేవి మరణాన్ని కూడా తమ స్వార్ధ రాజకీయాలకోసం కాంగ్రెస్ పార్టీ వాడుకుంది.శవాల మీద పేలాలు ఏరుకునే కాంగ్రెస్ పార్టీ ఇలా నీచ రాజకీయాలకు పాల్పడి ఉన్న కాస్తా పరువును కూడా కోల్పోయిందని విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు శ్రీదేవి అభిమానులు …