తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పీచ్ సందేశాత్మకంగా ..వివరణాత్మకంగా..ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులు ,సంఘటనలు ,ప్రజల జీవనశైలి ఇలా పలు అంశాల ఆధారంగా ఉంటుంది.అంతే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే స్పీచ్ లో మధ్య మధ్యలో వచ్చే ఛలోక్తులు ,సామెతలు ,కథలు అందర్నీ ఆకట్టుకుంటాయి.
అంతగా ప్రభావితం చేస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీచ్ .తాజాగా రాష్ట్రంలో కరీంనగర్ లో రైతుసమన్వయ సమితి ప్రాంతీయ సదస్సుకు ముఖ్యమంత్రి హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగం ఎదుర్కుంటున్న సమస్యలను ..వాటి పరిష్కార మార్గాలు ..ప్రాజెక్టులు పూర్తీ ..మద్దతు ధర ..సమన్వయ సమితి తదితర అంశాల గురించి వివరించారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి విసిరిన ఛలోక్తి అక్కడివారితో పాటుగా కేసీఆర్ స్పీచ్ వింటున్న చూస్తున్న అందరి మదిని దోచుకుంది.ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు కేవలం ఐదు శాతం ఉప్పునే తినాలి.కానీ మనవాళ్ళు మాత్రం ఏకంగా ఇరవై శాతం తింటున్నారు.అందుకే ఎక్కువగా కోపాలు ..బీపీ ..తాపాలు అని విసిరిన ఛలోక్తి అందర్నీ నవ్వించింది.