Home / MOVIES / శ్రీదేవి పై బయోపిక్ పై వర్మ క్లారిటీ..!

శ్రీదేవి పై బయోపిక్ పై వర్మ క్లారిటీ..!

గత కొన్ని రోజుల క్రితమే అందాలనటి శ్రీదేవి దుబాయ్ లో మరణించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆమె మరణాన్ని తన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవిని ఆరాధ్యదేవతగా భావించే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కూడా ఎంతో ఆవేద‌న‌కు గురై .. వరుస ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే .

see also :Big Breaking News-రాజ్యసభ వైసీపీ అభ్యర్థి ఖరారు..!

అయితే తాజాగా శ్రీదేవి గురించి, ఆమెతో త‌న అనుబంధం గురించి ఇవాళ మరోసారి వ‌రుస ట్వీట్లు చేశారు.కాగా సోషల్ మీడియాలో శ్రీదేవి పై వర్మ బయోపిక్ తీస్తున్నారు అనే వార్త గత కొన్ని రోజులుగా సంచలనంగా మారింది.అయితే ఈ వార్త పై వర్మ వరుస ట్విట్లు చేసి క్లారిటీ ఇచ్చారు.శ్రీదేవి బ‌యోపిక్‌ను తెర‌కెక్కించే ఆలోచ‌న త‌న‌కు లేద‌ని తెలిపారు. తాను శ్రీదేవి బ‌యోపిక్‌ను తెర‌కెక్కిస్తున్నానంటూ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు నిజం కావు అని.. అస‌లు ఆ ప్ర‌య‌త్నం చేయ‌డ‌మే అవివేకం అని తెలిపారు. ఎందుకంటే శ్రీదేవిలా న‌టించ‌గ‌ల న‌టి ఒక్క‌రూ లేర‌ని ట్వీట్ చేశారు.

see also :అసలు ఎవరీ జోగినపల్లి సంతోష్ కుమార్..

see also :ప్రత్యేక హోదా పోరాటంలో ఎవరు హీరో..!ఎవరు విలన్..!-బాబు సొంత సర్వే..!