ప్రత్యేక హోదాపై గురువారం సాయంత్రం అరుణ్ జైట్లీ ప్రకటన.. ఆ ప్రకటనపై చంద్రబాబు స్పందన నేపథ్యంలో ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా సంతరావురులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.ఈ మీడియా సమావేశం ప్రారంభంలో ఆయన మీడియా ప్రతినిధులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ప్రతినిధులు కూడా తన ప్రెస్‌మీట్‌కు రావడంపై జగన్ అభ్యంతరం తెలిపారు.
see also..బిగ్ బ్రేకింగ్: జగన్‌పై ఈడీ ఉత్తర్వులను కొట్టేసిన అప్పిలేట్ ట్రిబ్యునల్..!!
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వారిని వైసీపీ మీడియా సమావేశాలకు రావొద్దని బహిష్కరించాం కదా అని జగన్ ప్రశ్నించారు. పిలుపు లేకున్నా మీడియా సమావేశాలకు రావడం కరెక్ట్ కాదన్నారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై కోర్టు కేసు కూడా వేశామన్నారు. సాక్ష్యాలు లేకుండా, అన్యాయంగా తప్పుడు కథనాలు రాశారని దానిపై కేసునడుస్తోందన్నారు. అందుకే ఏబీఎన్, ఆంధ్రజ్యోతిని వైసీపీ ఎప్పుడో బహిష్కరించిందని జగన్ చెప్పారు. అయినప్పటికీ తెలిసో తెలియకో ప్రెస్‌మీట్‌కు వచ్చారు కాబట్టి ఉండాలని.. మరొక సారి రావొద్దని జగన్ సూచించారు.