Home / ANDHRAPRADESH / ఐదున్నర కోట్ల ఆంధ్రులు ఫిదా అయ్యే మాట చెప్పిన కేటీఆర్‌

ఐదున్నర కోట్ల ఆంధ్రులు ఫిదా అయ్యే మాట చెప్పిన కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత కేటీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న అన్ని వ‌ర్గాల చూపును త‌న‌వైపు తిప్పుకొంది. కీల‌క స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు ఢిల్లీకి వెళ్లిన మంత్రి కేటీఆర్‌ను మీడియా ప‌ల‌క‌రించింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లుచేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంట్‌పై మీడియా ప్ర‌శ్నించ‌గా…దేశంలో ఉన్నది రెండు పార్టీల వ్యవస్థ కాదు. రెండు పార్టీల మధ్య పోరాటం అంతకన్నా కాదన్నారు. భారత్ రెండు పార్టీల వ్యవస్థ కాదన్న మంత్రి.. ఇప్పుడున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. అందుకే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యామ్నాయ ఆలోచ‌న చేశార‌ని వివ‌రించారు. త‌మ‌ది థర్డ్ ఫ్రంట్ కాదు ఫస్ట్ ఫ్రంటే అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

see also :సొంతగూటికి కాంగ్రెస్ నేత ..!

ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న గురించి మరింత వివ‌రంగా మంత్రి కేటీఆర్ పేర్కొంటూ అధికారమంతా ఢిల్లీలో కేంద్రీకృతమైంద‌ని,  అది సరికాదని అన్నారు. అందుకే కేసీఆర్ కొత్త చర్చ తీసుకువచ్చారు.. అది మంచి పరిణామాలకే దారి తీస్తోందని కేటీఆర్ విశ్లేషించారు. బహుళ పార్టీల వ్యవస్థ, ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్న మన దేశంలో గమనిస్తే రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క పార్టీకీ పూర్తిస్థాయి మెజార్టీ రాదనేది  అంతా రాజకీయంగా భావిస్తున్నారు. భాజపాను చూసినా, కాంగ్రెస్‌ను చూసినా రెండూ పూర్తి మెజార్టీ సాధించే పరిస్థితుల్లో లేవు. దేశంలో కేంద్రంలో కేంద్రీకృతమైన పెత్తనాన్ని ప్రశ్నించేవిధంగా, ఫెడరల్‌ వ్యవస్థకు ప్రతిబింబంగా ఓ కొత్త ప్రత్యామ్నయం వస్తే మంచిదనే ఉద్దేశంతో ఓ చర్చకు సీఎం శ్రీకారం చుట్టారు. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి, ఏ రకంగా ఈ కూటమి రూపుదిద్దుకుంటుందో చూడాలి. దిల్లీలో కేంద్రీకృతమైన పెత్తనాలు, అధికారాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కేవలం ఉపాధి హామీ కూలీల డబ్బులు కూడా దిల్లీలో వేస్తే గ్రామాల్లో తీసుకొనే పరిస్థితి ఎందుకు ఉండాలనేదానిపై కేసీఆర్‌ ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో కేంద్రానికి పనేంటని ప్రశ్నించారు. రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుంది. మొత్తం అధికారాలు కేంద్రీకృతం అయితే దేశానికి అపారమైన నష్టం జరుగుతుంది కాబట్టే ఒక కొత్త చర్చకు లేవనెత్తారు. భవిష్యత్తులో మంచి పరిణామాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నాను` అని అన్నారు.

see also :2019లో సీఎం జ‌గ‌నే.. టాలీవుడ్ న‌టుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో త‌మ‌కు ఎదురైన అనుభవమే ఆంధ్రామిత్రులకు కూడా ఎదురైనట్టుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. `. కేంద్రం నుంచి ఒక్క పైసా రాష్ర్టానికి అదనంగా రాలేదు.. రావాల్సిన నిధులే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇదే జరిగింది. అందుకే వారు బయటకు వచ్చారు. నిజంగా చెప్పాలంటే.. ఎన్డీయేకు ఆ కూటమిలో ఎవరూ మిగలలేదు. చంద్రబాబు బయటకు వచ్చాక శివసేన వైదొలిగిన తర్వాత ఎవరూ లేరు. బలహీన పడ్డ అకాళీదళ్‌ , భాజపా తప్ప ఎన్డీయేలో ఎవరూ లేరు. అందువల్ల కేంద్రం పునరాలోచించుకోవాలి. కూటమి నుంచి ఎందుకు వెళ్లిపోతున్నారో ఆలోచించాలి’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat