తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.పర్యటనలో భాగంగా మంత్రి గంబీ రావు పేట మండలం కొత్తపల్లి లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసారు.అనంతరం ఓ పార్కు ను ప్రారభించారు.అయితే అక్కడే కేటీఆర్ ముందు, పోచమ్మల రజిత ‘సార్ నన్ను ఆదుకోండి’ అంటూ ప్లకార్డును ప్రదర్శించింది.
see also :ఏన్నారై శాఖకు చరిత్రలో ఏన్నడు లేనన్ని నిధులు..!
సిరిసిల్ల సంజీవయ్య నగర్‌కు చెందిన ఆమె భర్త రాజు గత నెలలో గుండెపోటుతో మృతిచెందాడు. సొంత ఇల్లు లేక రోడ్డుపైనే భర్త శవాన్ని ఉంచి దహన సంస్కారాలు చేసింది. రజిత ప్రస్తుతం 8 నెలల గర్భిణి. ఉండడానికి ఇల్లు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న తన పరిస్థితిని చూసి ఆదుకోవాలంటూ కమ్యూనిట్ హాల్ వద్ద ఆమె ప్ల్లకార్డుతో నిలబడింది. వెంటనే చలించిన మంత్రి కేటీఆర్.. రజిత దగ్గరికి వచ్చి ఆర్థిక సాయం చేయడంతోపాటు తక్షణమే ఆమెను ఆదుకోవడానికి కలెక్టర్‌కు సూచించారు.
see also :”పవన్ కల్యాణ్ కొత్త కథ”కు స్ర్ర్కీన్‌ప్లే ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!!
అలాగే మరోసారి ,మంత్రి కేటీఆర్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల మండలం పెద్దూరులో క్యాన్సర్‌తో బాధ పడుతున్న మహిళకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు