ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ మహానగరంలో జూబ్లిహిల్స్ లో లోటస్ పాండ్ లో ఉంటున్న సంగతి విదితమే.అయితే ప్రస్తుతం రాష్ట్రానికి కేంద్రం ఇవ్వకుండా మోసం చేసిన ప్రత్యేకహోదా కోసం జగన్ అండ్ బ్యాచ్ చేస్తున్న పోరాటం వలన ప్రయోజనం ఏమిటి? అసలు వీరి పోరాటం నిజమేనా?లోటస్ పాండ్ అనేది ఒక రాజాప్రసాదం? దానిలో డెబ్బై పడకగదులు ఉన్నాయి ..నాలుగువందల కోట్లు విలువ చేస్తుందని ? పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు .అయితే అందులో నిజంగా డెబ్బై పడక గడులున్నయా..నాలుగు వందల కోట్ల విలువ ఉంటుందా ..అయితే
See Also:వైసీపీ అధినేత జగన్ సంచలనాత్మక నిర్ణయం ..!
ఈ విషయాన్ని తేల్చుకోవాలంటే ఎవరిని అడిగి తెలుసుకోవాలి? ..ప్రస్తుతం వైసీపీలో ఆపార్టీ అధినేత జగన్ తరువాత స్థానం లో ఉన్న రాజ్యసభ సభ్యులు వి విజయసాయి రెడ్డి ద్వారా తెలుసుకోవాలి .ఎందుకంటే ఆయనకంటే ఇంకెవరు వివరాలు సాధికారికంగా చెప్పగలరు?.విజయసాయి రెడ్డితో ఒక ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఒక ప్రముఖ వ్యాసకర్త .ఆ వ్యాసకర్త రాసిన పోస్టు ఇలా ఉంది .అదేమిటి అంటే నిర్మొగమాటంగా ప్రశ్నలు అడుగుతానని ముందుగానే చెప్పాను. ఆయన సంతోషంగా అంగీకరించారు. అడిగిన ప్రశ్నలు అన్నిటికి సూటిగా సమాధానం చెప్పారు. ఏ ఒక్క జవాబును దాటవేయలేదు. మాటల్లో ఎంతో సహనం, సంయమనం. రెచ్చగొట్టే ప్రశ్నలు వేసినా ఎక్కడా సహనాన్ని కోల్పోలేదు. చాలా ఓపికగా జవాబులు ఇచ్చారు.
See Also:ఏపీలో వెయ్యి కోట్ల స్కాము ..ఆధారాలు “దరువు”చేతిలో ..!
విజయసాయి రెడ్డిది పార్టీలో చాలా పెద్ద హోదా. ఆయన ఆ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి. జగన్ కు సన్నిహితుడు. వైఎస్సార్ కు అంతరంగికుడు. రాజారెడ్డి గారికి ఆడిటర్. మొత్తం మూడు తరాలను ఆయన ఆ కుటుంబంలో చూసారు. నిస్వార్ధంగా సేవ చేసారు. ఆయన సేవలను ఎలా ఉపయోగించుకోవాలో గ్రహించిన జగన్ రెడ్డిగారిని రాజ్యసభకు ఎన్నిక చేశారు. గత రెండేళ్లుగా రెడ్డిగారు ఎలా పనిచేస్తున్నారో, జగన్ విశ్వాసాన్ని ఎలా చూరగొన్నారో చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇంటర్వ్యూ ను ప్రస్తావించుకునే ముందు లోటస్ పాండ్ గూర్చి చర్చిద్దాం.
See Also:వైసీపీలోకి కృష్ణా జిల్లాలో మొదలైన వలసలు -టీడీపీకి సీనియర్ నేత రాజీనామా ..!
ఫోటోలు చూడండి. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడి ప్రధాన కార్యాలయం. రెండు అంతస్తులు. మొత్తం నాలుగువేల చదరపు అడుగులు. ఇది దాదాపు ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబం జీవించే అపార్ట్మెంట్ అంత ఉంటుంది. పదిమంది ఉద్యోగులు. ఒక్క పోలీసు లేడు. హడావిడి లేదు. హంగులు లేవు. ఆర్భాటాలు లేవు. ఆఫీస్ గదులు కూడా చాలా చిన్నవి. విజయసాయిరెడ్డి గారి గది మన ఇళ్లలో సాధారణంగా ఉండే పడకగది సైజ్ కూడా లేదు.
ఇక జగన్ నివసించే ఇల్లు జగన్ స్థాయితో పోలిస్తే చాలా చిన్నది. అందులో డెబ్బై కాదు గదా… కనీసం ఏడు గదులు కూడా లేవు. అయిదు పడక గదులు మాత్రమె ఉన్నాయి. ఇవాళరేపు కొద్దిగా డబ్బున్న వాళ్ళు నాలుగైదు బెడ్ రూమ్స్ కలిగిన ఇల్లు కట్టించుకుంటున్నారు. ఇక జగన్ లాంటి పారిశ్రామికవేత్త, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ప్రతిపక్ష నాయకుడికి ఆమాత్రం ఇల్లు ఉండదా? లోటస్ పాండ్ తిప్పి తిప్పి కొడితే పదికోట్లు విలువ కూడా చేస్తుందో లేదో అనుమానమే.
హైద్రాబాద్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో లోటస్ పాండ్ లాంటి భవనాలు పది ఈజీగా పడతాయి.అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనత్త అయిన విమలమ్మ ,వైఎస్ షర్మీలా భర్త బ్రదర్ అనిల్ ,ఆయన యొక్క కార్యాలయం ,వైసీపీ పార్టీ కార్యాలయం ఇలా అన్ని కల్పి మొత్తం ఒక్క ఎకరాలో ఉంటుంది.ఇంతమంది కల్సి ఉంటున్న లోటస్ పాండ్ గురించితెలుగుదేశం అంత నిస్సిగ్గుగా ఎలా దుష్ప్రచారం చేస్తుందో మనబోటివారికి అర్ధం కాదు అని ఆయన ఒక వ్యాసాన్ని ప్రచురించగా ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .