Home / Tag Archives: jagan

Tag Archives: jagan

ఏపీలో కరోనా తగ్గుముఖం

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,330 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,918 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,86,050కి పెరిగింది. ఏపీలో 3 వేలకు తక్కువ కేసులు నమోదవడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. సుమారు రెండు నెలలుగా రాష్ట్రంలో రోజూ 5-10వేల కేసులు నమోదవుతూ వస్తున్నాయి. …

Read More »

ఎంపీ నందిగం సురేష్‌పై దాడికి యత్నం

ఏపీలో గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌పై తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బత్తుల పూర్ణచంద్రరావు గురువారం రాత్రి దాడికి యత్నించాడు. రాత్రి 10.30 గంటల సమయంలో ఉద్దండరాయునిపాలెంలోని తన ఇంటివద్ద నుంచి బయటకు వెళ్లేందుకు ఎంపీ కారులో బయల్దేరగా.. ఎదురుగా వచ్చిన పూర్ణచంద్రరావు తన బైక్‌ను అడ్డుపెట్టి అసభ్య పదజాలంతో దూషించాడు. ఎవరని ప్రశ్నించగా దాడి చేసేందుకు మీదకు రావడంతో భద్రతా …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కారుకు ప్రమాదం

ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ కారు ప్రమాదానికి గురైంది.తమిళనాడులోని చెన్నై నుండి గూడూరు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. నాయుడుపేట దగ్గర లారీను వైసీపీ ఎమ్మెల్యే కారు ఢీకొట్టడంతో డ్రైవర్ శ్రీహారికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే వరప్రసాద్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వెంటనే వీర్ని చెన్నైలోని ప్రముఖ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ముందు వెళ్తున్న లారీ …

Read More »

వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట విషాదం

ఏపీ అధికార పార్టీ  వైసీపీ రాజ్యసభ సభ్యులు,మాజీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది. ఆదివారం నాడు పిల్లి సతీమణి సత్యనారాయణమ్మ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ బ్రెయిన్‌ స్ట్రోక్‌ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో పిల్లి ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంపీ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం …

Read More »

ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ రోజు శనివారం ఉదయం విడుదల చేశారు. రాష్ట్రంలోని కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంసెట్‌లో ఇంజనీరింగ్ పరీక్షకు 1,56,953 మంది హాజరు అయ్యారు.. 1,33,066 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి తెలిపారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 75,858 మంది హాజరు అవగా.. 69,616 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో …

Read More »

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

ఏపీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్‌ (59) కన్నుమూశారు. ఇటీవల కరోనా సోకడంతో వైజాగ్‌లోని ఓ దవాఖానలో చేరిన ఆయన ఊపిరితిత్తులు దెబ్బతినడంతో చికిత్సపొందుతూ ఆదివారం సా యంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్ధం నగరంలోని పెద్దవాల్తేరు డాక్టర్స్‌కాలనీలోని ఆయన నివాసం వద్ద ద్రోణంరాజు పార్థివదేహాన్ని ఉంచనున్నారు. సోమవారం మధ్యా హ్నం మూడుగంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు శ్రీవాస్తవ తెలిపారు. ద్రోణంరాజు విశాఖ వన్‌టౌన్‌ …

Read More »

తెలంగాణ నీటి వాటాలను వెంటనే తేల్చాలి

ఆది నుంచీ తెలంగాణపై కేంద్రానిది ఇదే సవతి తల్లి ప్రేమ. దీన్ని ఎండగడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెఖావత్‌కు ఘాటుగా లేఖ రాశారు. తెలంగాణ వాదనను, వేదనను ఇకనైనా పట్టించుకోవాలని అందులో హితవు చెప్పారు. బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ విద్యావంతులకు, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో సమగ్రంగా అందులో వివరించారు. నదీ జలాల్లో వాటా- కేటాయింపుల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి.. …

Read More »

ఏపీ సీఎం జగన్ మామ మృతి

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మామ, వైఎస్‌ భారతి తండ్రి, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. హైదరాబాద్ నుంచి ఆయన భౌతికకాయాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం పులివెందులకు తీసుకురానున్నారు. ఇప్పటికే సీఎం జగన్ తల్లి విజయలక్ష్మి తాడేపల్లి నుంచి పులివెందులకు బయలుదేరారు. అలాగే 11 గంటలకు ముఖ్యమంత్రి కూడా పులివెందులకు వెళ్లనున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స …

Read More »

ఏపీలో కొత్తగా కొత్తగా 7,073 కరోనా కేసులు..

ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 7,073 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,61,458కి పెరిగింది. మరోవైపు 8,695 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో రికవరీలు 5.88 లక్షలకు పెరిగాయి. ఇక కరోనాతో పోరాడుతూ మరో 48మంది చనిపోయారు. చిత్తూరులో 8, ప్రకాశంలో 8, అనంతపురంలో 6, కృష్ణాలో 5, పశ్చిమ గోదావరిలో …

Read More »

ఏపీలో 6.5లక్షల మార్కును దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 6.5 లక్షల మార్కుని దాటేశాయి. గురువారం కొత్తగా 7,855 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,54,385కి పెరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మరోసారి వెయ్యికిపైగా కేసులు నమోదవగా.. ప్రకాశంలో 927 కేసులు బయటపడ్డాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 8,807 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో మరో 52 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. చిత్తూరులో 8, అనంతపురంలో 6, …

Read More »