ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నిలిచిపోయేలా ఏపీ ప్రతిసక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రతీ ఒక్కరిని పలుకరిస్తూ, సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తున్నారు వైఎస్ జగన్. దీంతో వైఎస్ జగన్‌కు ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతోందని, 2019లో వైసీపీ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమనే సంకేతాలను ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేగాక పాదయాత్ర మొదలు నుండి అక్కడక్కడ టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు కూడ జరిగాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత యలమంచిలి రవి త్వరలో తెలుగుదేశంకి రాజీనామా చేయనున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా రవి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జగన్ పాదయాత్ర రాజధాని జిల్లాలైన గుంటూరు,కృష్ణా జిల్లాల్లోకి ప్రవేశించే సమయానికి ఇతర పార్టీల్లోని కీలక నేతలను వైసీపీపిలోకి చేర్చుకోవాలని వైసీపీ ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా టీడీపీ నేతలే అన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే మొన్ననే జ్యోతుల చంటిబాబు, నిమ్మకాయల రాజరత్నం లాంటి తెలుగుదేశం నేతలు వైసీపీలో చేరారు. రవికి వైసిపికి మధ్య చాలాకాలంగా వ్యవహారం నడుస్తున్నా ఫైనల్ అయింది మాత్రం ఇపుడే.
కృష్ణా జిల్లాలోకి జగన్ ప్రవేశించేరోజున అంటే ఏప్రిల్ 10వ తేదీ ప్రాంతంలో రవి వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. రవి వైసిపిలో చేరటమంటే టిడిపికి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే, ప్రస్తుతం వైసిపిలో కమ్మ సామాజికవర్గానికి చెందిన చెప్పుకోదగ్గ నేతలు పెద్దగా లేరు. అటువంటిది మాజీ ఎమ్మెల్యే రవి వైసీపీలో చేరటమంటే వైసీపీకి ప్లస్ అనే భావించాలి. గతంలో ప్రజారాజ్యం తరపున రవి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అందుకే 2019 లో కూడ ఖచ్చితంగా గెలుస్దాననే ధీమాతో వైసీపీలోకి చేరుతున్నట్లు సమచారం.