ఐపీఎల్ చరిత్రలోనే ముంబాయి తొలిసారిగా …! – Dharuvu
Home / SLIDER / ఐపీఎల్ చరిత్రలోనే ముంబాయి తొలిసారిగా …!

ఐపీఎల్ చరిత్రలోనే ముంబాయి తొలిసారిగా …!

ఐపీఎల్ సీజన్లో ముంబాయి ఇండియన్స్ కి ఈ రోజు శనివారం ప్రారంభమైన మొదటి మ్యాచ్ లో అదిరే ఆరంభం దక్కింది .ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు .ఆ జట్టు ఓపెనర్లు సూర్య కుమార్ యాదవ్ కేవలం ఇరవై బంతుల్లో ఏడు ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో నలబై ఒక్క పరుగులను సాధించాడు.

మరో ఓపెనర్ లూయిస్ పదహారు బంతుల్లోనే నాలుగు ఫోర్లు ,మూడు సిక్సర్ల సాయంతో ముప్పై ఏడు పరుగులను సాధించడంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన యాబై పరుగుల రికార్డును ముంబాయి తన సొంతం చేస్కుంది.

కేవలం ఇరవై రెండు బంతుల్లోనే ఈ ఘనతను సాధించిన జట్టుగా ముంబాయి చరిత్రను తన పేరిట లిఖించుకుంది . తొలి ఆరు ఓవర్లు ముగిసే సరికి ముంబాయి ఎనబై నాలుగు పరుగులను సాధించింది ..