తన వినియోగదారులకు ఐడియా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.వొడాఫోన్-ఐడియా విలీనం చర్చలు చివరి దశలో ఉన్నసంగతి తెలిసిందే.అయితే ఈ క్రమంలోనే ఐడియా మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం రూ.149తో వాయిస్ టారిఫ్ ప్లాన్‌ను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్లో భాగంగా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. కాలపరిమితి 21 రోజులు మాత్రమే ఉంది .
ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్.. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ రూ.98 ప్లాన్‌కు పోటీగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. అవి 28 రోజుల కాలపరిమితితో అందిస్తుండగా ఐడియా తాజా ప్లాన్ కాలపరిమితి మూడు వారాలే కావడం ఇక్కడ గమనార్హం.ఐడియా రూ.149 ప్యాక్‌లో అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ అందిస్తున్నప్పటికీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాయిస్ కాల్స్ రోజుకు 250 నిమిషాలకు మించకూడదు. వారానికి వెయ్యి నిమిషాల నిబంధన ఉంది.