యువనేత ,తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.గత రెండు సంవత్సరాలుగా తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న ఓ చిన్నారికి వైద్య ఖర్చులకు సరిపడ పైసలను అందజేసి తన మంచి మనసును చాటుకున్నారు.
see also:హరిత హారానికి సన్నద్ధం కండి..మంత్రి జూపల్లి
వివరాల్లోకి వెళ్తే..రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన లచ్చిగారి రమేశ్, సుమ దంపతులకు భార్గవి, తనూజ ఇద్దరు కూతుళ్లు. రమేష్ ఆటో నడుపుతుండగా, సుమ కూలీ పనికి వెళ్లేది. చిన్నకూతురు తనూజకు ఏడాదిగా వెన్నునొప్పి రావడంతో ఎన్నో దవాఖానల్లో చూపించారు. అయితే ఆ నొప్పి నయంకాకపోవటంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా రూ. 5లక్షలు ఖర్చవుతుందని అక్కడి వైద్యులు చెప్పారు.
see also:పారదర్శకంగా బదిలీలు..!!
ఈ క్రమంలోనే విషయం తెలిసిన వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు పోత్గల్ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు, జెడ్పీటీసీ జనగామ శరత్‌రావు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చలించిపోయిన మంత్రి.. రూ. 4లక్షలను ఎల్‌వోసీ రూపంలో విడుదల చేసి మనవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా తమబిడ్డకు ప్రాణభిక్ష పెట్టిన మంత్రి కేటీఆర్‌కు, స్థానిక నేతలకు తనూజ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.