పెళ్ళిచూపులు సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న వరంగల్ ముద్దుబిడ్డ తరుణ్ భాస్కర్.తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా రూపొందింది. అయితే నూతన నటీనటులతో ఆయన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాలో సుశాంత్ రెడ్డి .. విశ్వక్ సేన్ .. వెంకటేశ్ నాయుడు .. అభినవ్ .. ప్రధానమైన పాత్రలను పోషించారు.ఇటివలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీ ని చిత్ర యూనిట్ తెలిపింది. అందులోభాగంగానే ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. కథ .. కథనాలు .. వివేక్ సాగర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధానబలంగా నిలుస్తాయని సినిమా విశ్లేషకులు అంటున్నారు. అయితే
తరుణ్ భాస్కర్ తొలిచిత్రమైన ‘పెళ్లి చూపులు’ ఘన విజయాన్ని సాధించడమే కాకుండా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. దాంతో సహజంగానే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి అని పలువురు అంటున్నారు .
