Home / 18+ / వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం.. భారీగా మోహరించిన పోలీసులు

వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం.. భారీగా మోహరించిన పోలీసులు

శ్రీకాకుళం జిల్లా జే.ఆర్‌.పురం పోలీసు స్టేషన్‌వద్ద కలకలం రేగింది. పోలీసు స్టేషన్‌ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గత కొంత కాలంగా జే.ఆర్‌.పురం పోలీసులు వేధింపులకు పాల్పడడం వల్ల సదరు వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా రణస్థలం మండల కేంద్రంలో దళితులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ముందస్తుగా జేఆర్‌ పురం పోలీసు స్టేషన్‌ వద్ద పోలీసు బలగాలు మోహరించాయి.