Home / SLIDER / గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తులు ఎంతో తెలుసా..?

గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తులు ఎంతో తెలుసా..?

గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తులను స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ లెక్క తేల్చింది. నయీంకు మొత్తం రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా సిట్ గుర్తించింది. 1019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, రెండు కిలోల బంగారం, రెండు కోట్ల నగదు ఆస్తులు గా తేల్చారు. నయీంపై మొత్తం నమోదైన 251 కేసుల్లో 119కేసులు దర్యాప్తు పూర్తయినట్లు సిట్ వెల్లడించింది. మరో 60 కేసులు కొలిక్కి రాలేదని.. రెండు నెలల్లో నయీం కేసును ముగించనున్నట్లు తెలిపారు. 2016 ఆగస్ట్ 8న మహబూబ్ నగర్ జిల్లాలో పోలీసు ఎదురు కాల్పుల్లో నయీం హతమైన తర్వాత అతని ఆస్తులకు సంబంధించి రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి.