Home / JOBS / నిరుద్యోగ యువతకు శుభవార్త..!

నిరుద్యోగ యువతకు శుభవార్త..!

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త.ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఎనిమిదన్నర వేలకుపైగా ఉద్యోగాలకు ఐబీపీఎస్ ప్రకటన జారీచేసింది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్-8 దరఖాస్తుల స్వీకరణ జూన్ 18నుండి మొదలైంది. దీంతో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆర్ఆర్బీ వివధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న 8400 ఉద్యోగాల భర్తీ జరగనున్నది. అయితే ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్లో దరఖాస్తు,ఫీజు చెల్లింపుకు జూలై4 చివరి తేది. ఎస్సీ,ఎస్టీ పీడబ్లూడీ అభ్యర్థులు రూ.100,ఇతరులు రూ.600లు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు. మిగిలిన వివరాలకు ఐబీపీఎస్ లో చూడవచ్చు..