Breaking News
Home / education / రైలు బోగీలపై, లోపల ఉండే ఈ నంబర్లు, అక్షరాలకు అర్థం ఏమిటో

రైలు బోగీలపై, లోపల ఉండే ఈ నంబర్లు, అక్షరాలకు అర్థం ఏమిటో

భారతీయ రైల్వే అంటే ఎంత పెద్ద ప్రజా రవాణా వ్యవస్థో అందరికీ తెలిసిందే. నిత్యం కొన్ని కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దేశవ్యాప్తంగా అనేక ట్రెయిన్లు నిత్యం నడుస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ ఉంటాయి.
అయితే. ఎప్పుడు ట్రెయిన్ ఎక్కినా మనం వెళ్లాల్సిన ట్రెయిన్ నంబర్‌, అది వచ్చే ప్లాట్‌ఫాం, మన దగ్గర టిక్కెట్ ఉందా, లేదా. ఇదిగో ఇవే విషయాలను మనం గమనిస్తాం. కానీ.. బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు మరికొన్ని విషయాలు తెలుస్తాయి. అవేమిటంటే.

ట్రెయిన్ బోగీలపై మీరెప్పుడైనా చిత్రంలో ఇచ్చిన విధంగా నంబర్లను చూశారా..? చూసే ఉంటారు కానీ వాటి గురించి అంతగా పట్టించుకుని ఉండరు. అయితే అదే కాదు, ఇంకో బొమ్మ చూడండి.బోగీ లోపల కూడా ఇంతకు ముందు చెప్పిన లాగానే అంకెలు కాకుండా అక్షరాలు ఉంటాయి. అవును, అవే.అయితే ఈ రెండింటి వల్ల మనకు పలు విషయాలు తెలుస్తాయి. అవేమిటో కింద చూద్దాం.మొదటి బొమ్మలో 98337 అనే నంబర్ బోగీపై ఉంది కదా. దీని అర్థం ఏమిటంటే. ముందు ఉన్న రెండు నంబర్లు ఆ బోగీ తయారైన సంవత్సరాన్ని సూచిస్తాయి. అంటే అందులో 98ని తీసుకుంటే ఆ బోగీ 1998లో తయారైందని అర్థం.అలాగే 8439 అని ఉందనుకోండి, అప్పుడు ఆ బోగీ 1984లో తయారైందని తెలుసుకోవాలి. సాధారణంగా ఈ సంఖ్యలు 4, 5 లేదా 6 నంబర్లను కలిగి ఉంటాయి. ఎన్ని నంబర్లు ఉన్నా మొదటి రెండు అంకెలు మాత్రం ఆ బోగీ తయారైన సంవత్సరాన్నే తెలియజేస్తాయి. అయితే రాజధాని వంటి కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నంబర్లు ఇలా ఉండవు2951/2 అని ఉంటాయి. ఇక పైన చెప్పిన 98337 అనే నంబర్‌లోని చివరి మూడు అంకెలకు కింది కోడ్ ఉంటుంది.పైన తెలిపిన నంబర్‌లోని చివరి మూడు అంకెలు 001 నుంచి 025 మధ్యలో ఉంటే ఆ బోగీ ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీ అని తెలుసుకోవాలి. ఇక ఆ తరువాత ఉంటే ఏ బోగీలో ఇప్పుడు చూద్దాం.

025 – 050 మధ్య ఉంటే : Composite 1st AC +AC-2T (ఏసీ 2 టైర్‌)

050-100 అయితే : AC 2T
101-150 మధ్య ఉంటే : AC 3T (ఏసీ 3 టైర్‌)
151-200 మధ్య అయితే : AC Chair Car
201-400 అయితే : Sleeper 2nd Class
401-600 అయితే : General Second Class
601-700 మధ్య అయితే : 2L Sitting Jan ShatabdI chair

701-800 మధ్య అయితే : Sitting Cum Luggage Rake

అంటే పైన చెప్పిన 98337 అనే నంబర్‌లో 98 అనే నంబర్ల ద్వారా ఆ బోగీ 1998లో తయారైనట్టు తెలిస్తే, ఇక 337 అనే నంబర్ల ప్రకారం ఆ బోగీ పైన పట్టిక ప్రకారం స్లీపర్ సెకండ్ క్లాస్ అని తెలుస్తుంది.
ఇక రెండో బొమ్మలో ఉన్న WGSCN అనే కోడ్ అర్థం ఏమిటంటే
W అంటే – prefix సిరీస్ ప్రారంభ అక్షరం
G అంటే – Self-generating (lighting by axle generators) – స్వయం చాలిత బోగీ
S అంటే – సెకండ్ క్లాస్ (Second Class)
CN అంటే: 3-tier sleeper coach (3 టైర్ స్లీపర్ కోచ్‌)
అయితే ఇక్కడ WGSCNలో చివరన ఉన్న రెండు అక్షరాలు (CN) బోగీని బట్టి మారుతాయి. అవేమిటంటే.
CN అంటే – 3-tier sleeper coach
CW – 2-tier sleeper coach
CB – Pantry/kitchen car/buffet car
CL – Kitchen car
CR – State saloon
CT – Tourist car (first class) (includes bathrooms, kitchen, and sitting and sleeping compartments)
CTS – Tourist car (second class) (includes bathrooms, kitchen, and sitting and sleeping compartments)
C – (except as above) With Coupe
D – Double-decker

Y – (not as prefix) With Ladies’ compartment (usually 6-berth compartment with locking door)
AC – Air-conditioned

ఇక WGSCN కిందే ఉన్న 96241 అనే నంబర్ గురించి పైనే చెప్పుకున్నాం కదా.ఆ బోగీ 1996లో తయారైందని, 241 అంటే ఆ బోగీ స్లీపర్ సెకండ్ క్లాస్ అని తెలుస్తుంది.