Home / SLIDER / తెలంగాణ బడ్జెట్ రూ.1,46,492 కోట్లు

తెలంగాణ బడ్జెట్ రూ.1,46,492 కోట్లు

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2019-20ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సోమవారం శాసనసభలో ఉదయం పదకొండున్నరకు ప్రవేశ పెట్టారు. మరోవైపు శాసనమండలిలో తొలిసారిగా ఆర్థిక శాఖ మంత్రిగా తన్నీరు హారీశ్ రావు పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయి బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం బడ్జెట్ రూ.1,46,492కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు
మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు
బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు
రాష్ట్ర ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు