Home / SLIDER / దిగోచ్చిన యాపిల్ ఫోన్స్ ధరలు

దిగోచ్చిన యాపిల్ ఫోన్స్ ధరలు

ప్రముఖ స్మార్ట్ ఫోన్లను మేకింగ్ చేసే ఆపిల్ విడుదల చేసిన ఐఫోన్ 11, 11ప్రొ, 11ప్రొ మ్యాక్స్ ఫోన్లకు ఇండియాలో ప్రి-ఆర్డర్లు షురూ అయ్యాయి. అలాగే వాచ్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లకు కూడా ప్రి-ఆర్డర్లను ప్రారంభించారు. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్ సహా ఆపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్లు ప్రి-ఆర్డర్లను రిసీవ్ చేసుకుంటున్నారు.

కాగా వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ కార్డులను ఉపయోగించి ఐఫోన్ 11, 11ప్రొ ఫోన్లను కొంటే రూ.6వేల వరకు, 11 ప్రొ మ్యాక్స్‌ను కొనుగోలు చేస్తే రూ.7వేల డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఆపిల్ వాచ్ సిరీస్ 5 వాచ్‌లపై హెచ్‌డీఎఫ్‌సీ కార్డు హోల్డర్లకు రూ.4వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

ఐఫోన్ 11 ప్రారంభ ధర రూ.64,900 ఉండగా, 11 ప్రొ ప్రారంభ ధర రూ.99,900గా ఉంది. అలాగే ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్‌ను రూ.1,09,900 ప్రారంభ ధరకు, ఆపిల్ వాచ్ సిరీస్ 5 వాచ్‌ను రూ.40,900 ప్రారంభ ధరకు విక్రయిస్తున్నారు. ఇక ఈ నెల 27వ తేదీ నుంచి ఐఫోన్ 11 ఫోన్ల‌తోపాటు ఆపిల్ వాచ్ సిరీస్ 5 వాచ్‌లు వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానున్నాయి.