Home / SLIDER / తెలంగాణ రాష్ట్రానికి 3 అవార్డులు

తెలంగాణ రాష్ట్రానికి 3 అవార్డులు

తెలంగాణ రాష్ట్రానికి జాతీయ జల పథకం అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి మొత్తం మూడు విభాగాల్లో అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులను ఈ నెల ఇరవై ఐదో తారీఖున దేశ రాజధాని ఢిల్లీలో ఇవ్వనున్నారు. ఈ కింది అంశాల్లో మూడు అవార్డులు వచ్చాయి. అందులో
1).సమగ్ర నీటి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచిన అంశంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్..

2).భూగర్భ జలవనరుల నిర్వహణ పకడ్బందీగా నిర్వహిస్తున్నందుకు భూగర్భ జల

విభాగం.3).ఇంటింటికి తాగునీటి పథకం మిషన్ భగీరథలు ఈ అవార్డులకు ఎంపికయ్యాయి.