Breaking News
Home / SLIDER / టీఆర్‌ఎస్ పాలన అద్భుతం

టీఆర్‌ఎస్ పాలన అద్భుతం

తెలంగాణ రాష్ట్ర బఢ్జెట్ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ఎన్‌ఆర్‌సీపై ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

త్వరలోనే ఓల్డ్‌సిటీలో కూడా మెట్రో రైలు విస్తరిస్తామని తెలిపారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి అనుసరిస్తోంది. అవసరమైతే అసెంబ్లీలో 12శాతం రిజర్వేషన్లపై తిర్మానం చేద్దామన్నారు.కాంగ్రెస్ సభ్యులు అసత్యాలు మాట్లాడుతున్నారు. కాంగ్రెసోళ్లకు దేనిపై ఏది మాట్లాడాలో కూడా తెలియడం లేదు. 33 జిల్లాల్లో ఎవరిని అడిగిన కూడా టీఆర్‌ఎస్ పాలన అద్భుతంగా ఉందంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు 9కి పడిపోయింది. బీజేపీ 5 సీట్ల నుంచి ఒక సీటుకు పడిపోయింది. టీఆర్‌ఎస్ పార్టీ 63 నుంచి 88కి పెరిగింది.