Home / BUSINESS / బ్యాంకులు సంచలన నిర్ణయం

బ్యాంకులు సంచలన నిర్ణయం

దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం యూనిట్లుగా ఏర్పాటు చేస్తున్న సంగతి విదితమే. ఇందులో కొన్నిటిని ఇప్పటికే విలీనం చేసింది కూడా.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకులు ఈ నెల 26,27న సమ్మె చేయాలనే నిర్ణయం తీసుకున్నాయి.

అయితే తాజాగా తమ డిమాండ్ల గురించి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ తో AIBOC,AIBOA,INBOC,NOBOసంఘాలకు చెందిన నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఆయా సంఘాల నేతలు విన్నవించిన డిమాండ్లపై రాజీవ్ కుమార్ సానుకూలంగా స్పందించారు.

దీంతో ఈ నెల రెండు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన బ్యాంకులను సమ్మెను విరమించుకుంటున్నట్లు సంఘాల నేతలు తెలిపారు. అయితే ఒకవేళ ఈ సమ్మె జరిగి ఉంటే వరుసగా నాలుగురోజులు బ్యాంకులు బంద్ కావడంతో ఖాతాదారులు ,బ్యాంకులతో లావాదేవీలు నిర్వహించేవారు ఇబ్బంది పడి ఉండేవారు.