Home / ANDHRAPRADESH / పవన్ కు మరో షాక్…గాజువాకలో జనసేన ఖాళీ..!

పవన్ కు మరో షాక్…గాజువాకలో జనసేన ఖాళీ..!

ఆంధ్రప్రదేశ్ లో జనసేనకు రోజురోజుకు షాక్ మీద షాక్ తగులుతుంది. ఆ పార్టీ నుండి వారానికి ఒకరు రాజీనామా చేస్తున్నారు. మొన్నటికి మొన్న సీనియర్ నాయకుడు ఆకుల సత్యనారాయణ పార్టీని వీడారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. కనీసం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సైతం ఒక్క చోట కూడా గెలవలేకపోయాడు. చివరికి ఈ ఎన్నికల్లో ఒక్క సీట్ తో సరిపెట్టుకున్నారు. అయితే ఇక అసలు విషయయానికి వస్తే ఆ పార్టీ నుండి వరుసగా వరుసగా నాయకులు క్యూ కడుతున్నారు. తాజాగా గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఆ పార్టీకి గుడ్ బాయ్ చెప్పాడు. ఈమేరకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ రాసాడు. ఈయన మొన్న జరిగిన ఎన్నికల్లో పెందుర్తి నుండి పోటీ చేసారు. నియోజకవర్గ ప్రజలు, నాయకులు, అభిమానుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకునట్టు ఆయన తెలిపారు.