Home / SLIDER / తెలంగాణలో వెనక్కి తగ్గిన క్యాబ్ డ్రైవర్స్

తెలంగాణలో వెనక్కి తగ్గిన క్యాబ్ డ్రైవర్స్

తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు దిగిన క్యాబ్ డ్రైవర్స్ వెనక్కి తగ్గారు. ప్రస్తుతం గత పద్నాలుగు రోజుల పాటు ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న సమ్మెతో ఇబ్బందులను పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయా సంఘాల నాయకులు తెలిపారు.

అయితే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ సూచనతో వారు శాంతించారు. క్యాబ్ డ్రైవర్స్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానితో మాట్లాడి కృషి చేస్తానని తనను కలిసిన క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ల నాయకులకు గవర్నర్ తమిళ సై హామీచ్చారు. దీంటొ సమ్మెను విరమిస్తున్నామని వాళ్ళు ప్రకటించారు..