Home / SLIDER / ఫలించిన చర్చలు

ఫలించిన చర్చలు

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి.ఈ చర్చల్లో భాగంగా విద్యుత్ సంఘాలు పేర్కొన్న డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

అందులో భాగంగా ఆర్టిజన్స్ సర్వీస్ రూల్స్,రెగ్యులేషన్ పై ఒప్పందం జరిగింది. అంతేకాకుండా అక్టోబర్ 1 ,2019 ప్రాతిపదికగా ఆర్టిజన్ల పే ఫిక్సేషన్ ,వీడీఏ స్థానంలో డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

ఇకపై నుంచి ఆర్టిజన్లకు కూడా వేతన సవరణ ఉంటుంది. ఆర్టిజన్లకు ఇచ్చే సదుపాయాలన్నీ రెస్కో ఉద్యోగులకు కూడా కల్పించనున్నట్లు పలు ఒప్పందాల పత్రాలపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.