Breaking News
Home / MOVIES / మెగా అభిమానులకు నిహారిక దిమ్మతిరిగే షాక్

మెగా అభిమానులకు నిహారిక దిమ్మతిరిగే షాక్

నిహారిక మెగా ఇమేజ్ ను అడ్డుపెట్టుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీచ్చిన ఏకైక మెగా హీరోయిన్ ఈ ముద్దుగుమ్మ. మత్తెక్కించే అందం.. చక్కని అభినయం ఉన్న కానీ అదృష్టం కలిసి రాక రెండంటే రెండే మూవీల్లో అమ్మడు నటించింది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ లాంటి చిత్రాల్లో నటించిన కానీ ఈ మెగా హీరోయిన్ కు లక్ కలిసి రాలేదు.

అయిటే ఆ తర్వాత తను గెస్ట్ గా ఒక కార్యక్రమాన్ని నిర్వహించగా అది కూడా పెద్దగా అమ్మడుకు కలిసి రాలేదు. ఇక లాభం లేదనుకుని నిహారిక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది మెగా అభిమానులకు బిగ్ షాక్ లాంటి వార్తనే.పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ తాజాగా ‘మ్యాడ్ హౌజ్’ పేరుతో వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇది దాదాపు వంద ఎపిసోడ్స్ ఉంటుంది అని సమాచారం .

ఒక ఇంటి యజమాన్యురాలిగా కన్పించే నిహారిక ప్రస్తుతం విడుదలైన రెండు భాగాల్లో అమ్మడు కన్పించలేదు. దీంతో రానున్న ఎపిసోడ్స్ లలో ఈ ముద్దుగుమ్మ ఉంటుంది అంట. ఈ వంద ఎపిసోడ్స్ పూర్తయ్యే వరకు సినిమాలు ఒప్పుకోకూడదని అమ్మడు నిర్ణయించుకుందంట.తమ మెగా వారసురాల్ని ఎంతైన హీరోయిన్ గా చూసుకోవాలని ఆరాటపడుతున్న మెగా అభిమానులకు ఇది దిమ్మతిరిగే షాకే.