Home / BUSINESS / ఫోన్ పే వాడుతున్నారా..?

ఫోన్ పే వాడుతున్నారా..?

మీరు ఫోన్ పే వాడుతున్నారా..?. దీని ద్వారా ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ తదితర ఆర్థికలావాదేవీలు చేస్తున్నారా..?. అయితే మీకో శుభవార్త. ఇక నుండి ఫోన్ పే యూజర్లు తమ యూపీఐ ద్వారా మనీ డ్రా చేసుకోవచ్చు.

ఫోన్ పే ఏటీఎం పేరుతో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ తో వ్యాపారవేత్తలకు ఆన్ లైన్లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసి నగదు తీసుకోవచ్చు.

అయితే ప్రస్తుతం ఈ అవకాశం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో అందుబాటులో ఉండగా భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకురానున్నది. ఏ వ్యాపారి అయిన సరే ఫోన్ పే ఏటీఎం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కస్టమర్ రోజుకూ కేవలం రూ.1000మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చు..