Home / SLIDER / సీఎం కేసీఆర్‌తో ట్రంప్‌ కరచాలనం

సీఎం కేసీఆర్‌తో ట్రంప్‌ కరచాలనం

 

రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన ప్రత్యేక విందు కార్యక్రమం ప్రారంభమైంది. తొలిసారి రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం కాసేపు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా విందుకు హాజరైన కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలను ట్రంప్‌ పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కరచాలనం చేశారు. సీఎం కేసీఆర్‌ తనను తాను ట్రంప్‌కు పరిచయం చేసుకున్నారు.