Home / SLIDER / కరోనా గురించి భయం వద్దు..స్వీయ జాగ్రత్తలే ముద్దు

కరోనా గురించి భయం వద్దు..స్వీయ జాగ్రత్తలే ముద్దు

కరోనా విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ,అన్ని విధాల జిల్లా యంత్రాంగం ప్రజా ప్రతినిధులు అండగా ఉన్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

శనివారం కలెక్టర్ చాంబర్లో ఎం ఎన్ ఆర్ ఆస్పత్రి సీఈఓ మూర్తి ,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ తో కలిసి covid 19 కేసులు,అందిస్తున్న పౌష్టికాహారం తదితర విషయాలపై సమీక్షించారు. జిల్లా ఆస్పత్రి లోని ఐసోలేషన్ కు అదనంగా 100 పడకల covid ఆస్పత్రిని ఎమ్మెన్నార్ మెడికల్ కళాశాలలో ఈనెల 15న ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం 28 మంది కరోణ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎం ఎన్ ఆర్ కళాశాల లో ఏర్పాటు చేస్తున్న వంద పడకల ఆసుపత్రిలో ఐసియు సౌకర్యం కూడా కల్పించామని, ఎలాంటి కోవిడ్ లక్షణాలు కనిపించిన ప్రజలెవరూ ఆందోళన చెందకుండా దగ్గరలోని పీ హెచ్ సి లో కానీ జిల్లా ఆస్పత్రిలో కాని సంప్రదించాలని సూచించారు. సంబంధితు లకు అన్ని పరీక్షలు చేస్తారని అవసరమైన ట్రీట్మెంట్ అందిస్తారని తెలిపారు.

పౌష్టికాహారం అందించడంతో పాటు వేడినీరు లెమన్ టీ అందించడం ఆవిరి పట్టడం లాంటి వి ప్రత్యేక గంగా చేస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎమ్మెన్నార్ ఆసుపత్రి ప్రతినిధులు మంత్రితో పాటు ఒక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలని కలెక్టర్కు మంత్రి సూచించారు.

పేషెంట్లకు అందించే మందులు కిట్లు అన్ని కూడా అందుబాటులో ఉండాలని మందుల విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఆహారానికి సంబంధించి మెనూ మేరకు అందించాలని ఆసుపత్రి వర్గాలకు సూచించారు.
సమీక్షలు ఈ సమీక్షలో కలెక్టర్ వైద్యాధికారులు అదనపు కలెక్టర్ శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat