Breaking News
Home / Tag Archives: indian army

Tag Archives: indian army

వాట్సాప్‌లో ఆ సమాచారం పంపొద్దు ..చాలా జాగ్రత్త

ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) పన్నే ఉచ్చులో పడొద్దని భారత సైనికులను ఆర్మీ అధికారులు హెచ్చరించారు. రక్షణ వ్యవస్థకు సంబంధించి ఏదైనా కీలక సమాచారం వాట్సాప్‌ గ్రూప్‌లలో షేర్‌ చేయొద్దని మార్గదర్శకాలు జారీ చేశారు. దాంతోపాటు ముఖ్య అధికారులు, నేతల రాకపోకలకు సంబంధించి వాట్సాప్‌లో సమాచారం షేర్‌ చేయొద్దని చెప్పారు. అపరిచిత గ్రూప్‌లలో మెంబర్లుగా ఉంటే.. పాకిస్తాన్‌ దాయాదులకు సమాచారం చేరే అవకాశాలున్నాయని అన్నారు. సమాచారం చోరీ కాకుండా ఉండేందుకు …

Read More »

పుల్వామాలో మరోసారి ఉగ్రవాదులు కాల్పులు..!

జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా దళాల పెట్రోలింగ్‌ పార్టీపై మంగళవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలపై దాడికి పాల్పడిన అనంతరం ఉగ్రవాదులు పరారయ్యారు. పెట్రోలింగ్‌ పార్టీపై దాడులకు తెగబడిన ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు ఆ ప్రాంతాన్ని సైన్యం జల్లెడపడుతోంది. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. కాగా, జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ట్రక్‌ డ్రైవర్‌ను కాల్చిచంపిన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టిన కొద్దిసేపటికే పుల్వామా ఉగ్ర …

Read More »

ఇంటర్ తో ఉద్యోగాలు

మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేశారా.. మీకు చదువుకునే స్థోమత లేదా.. ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే. వచ్చే ఏడాది జూలై నెలలో ప్రారంభం కానున్న 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 16.5-19.5 సంవత్సరాల మధ్య ఉన్న వారు దీనికి ఆర్హులు. నవంబర్ 13వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు …

Read More »

పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం భారత దళాలు సిద్ధం.. ఆనందంలో దేశ ప్రజలు.. కేంద్రం కూడా ఇదే విధంగా

భారతీయుల నెరవేరని కలగా చెప్పబడుతున్న పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మన సైనిక దళాలు రెడీగా ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బీసీపీ రావత్ గురువారం స్పష్టంచేశారు. పీవోకేను భారత్‌లో అంతర్భాగం చేసేందుకు ప్రభుత్వం ఆదేశిస్తే సైనికచర్యకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. శత్రుదేశం అయిన పాకిస్తాన్‌ నుంచి పీవోకేను సాధించడమే భారతదేశ తదుపరి అజెండా అంటూ రావత్‌ తేల్చిచెప్పారు.   ఈనిర్ణయం తీసుకోవాల్సింది భారత …

Read More »

బ్రేకింగ్..భారత్‌లో చొరబడిన 40 మంది ఉగ్రవాదులు…?

కశ్మీరీ ప్రజలకు కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసి.. కశ్మీర్ రాష్ట్రాన్ని జమ్ము, కశ్మర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ మోడీ సర్కార్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కశ్మీరీ అంశంపై 70 ఏళ్లుగా చలికాచుకుంటున్న పాకిస్తాన్‌ ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో యాగీ చేసినా..ఆఖరికి ఐక్యరాజ్యసమితికి వెళ్లినా..కశ్మీరీ అంశం భారత అంతర్గత సమస్య,..అందులో జోక్యం చేసుకోమని ప్రపంచదేశాలు …

Read More »

పాక్ వక్రబుద్ధి

దాయాది దేశమైన పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఈ క్రమంలో తన భూభాగం పరిధిలోని సట్లేజ్ నదిపై ఉన్న గేట్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎత్తివేసింది. దీంతో పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లాలోని చాలా గ్రామాల్లోకి నీళ్లు చేరుకున్నాయి. సరిహద్దుల్లోని చివరి గ్రామం తెండీవాలాను నీళ్లు పూర్తిగా చుట్టిముట్టాయి. దీంతో సైన్యం ,అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు …

Read More »

17-23ఏళ్ళ యువకులకు శుభవార్త

తెలంగాణలోని పదిహేడు ఏళ్ల నుండి ఇరవై మూడు ఏళ్ళ వయస్సున్న యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న పదిహేడు నుండి ఇరవై మూడేళ్లు ఉండి .. దేశానికి సేవ చేయాలనుకునేవారికిది సువర్ణావకాశం. ఇందులో భాగంగా యువకులను ఆర్మీలో చేర్చుకునేందుకు రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించబోతుంది. అక్టోబర్ ఏడో తారీఖు నుండి పదిహేడు తారీఖు వరకు కరీంనగర్ కేంద్రంగా ఈ ర్యాలీ నిర్వహించనున్నది. ఈ ర్యాలీలో రాష్ట్రంలోని …

Read More »

తన హోదాను సైతం పక్కనపెట్టి ముందుకు సాగిన సైనికుడు..!

టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత కీపర్ మహేంద్రసింగ్ ధోని వెస్టిండీస్ టూర్ కి దూరమైన విషయం తెలిసిందే. ఆర్మీ ట్రైనింగ్ కోసం రెండు నెలలు క్రికెట్ నుండి విశ్రాంతి తీసుకున్న మిస్టర్ కూల్ ప్రస్తుతం కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాడు. ధోనికి ప్రస్తుతం ఆర్మీలో ఉన్న హోదా లెఫ్టినెంట్ కల్నాల్.. అంటే ఈ హోదాలో ఉన్నవారికి ప్రత్యేకంగా రూమ్ ఇస్తారు. అంతేకాకుండా ప్రత్యేక ఏర్పాటులు కూడా ఉంటాయి. కాని ధోని మాత్రం …

Read More »

కాశ్మీర్ లోయలో విధులు నిర్వహించనున్న లెప్టినెంట్ కల్నల్ ధోని..!

టీమిండియా జట్టు మాజీ సారధి, ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని… క్రికెటర్ గా ఇండియా ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మరింత పెంచాడు. అతడి కెప్టెన్సీలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. వన్డే ప్రపంచ కప్ మరియు  టీ20 ప్రపంచ కప్ తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక విజయాలను సాధించింది ఇండియా. ధోని క్రికెటర్ నే కాదు గొప్ప దేశభక్తుడు కూడా. ఎంత భక్తి అంటే దేశంకోసం …

Read More »

సరిహద్దుల్లో పాక్ సైనికుల కాల్పులు.. భారత జవానుకు గాయాలు.. ఎదురు కాల్పులు

మరోసారి శనివారం పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాన్ గాయపడిన ఘటన పూంచ్ జిల్లాలో వెలుగుచూసింది. పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.. ఇది కొత్తేమీ కాదు.. శనివారం ఉదయం పాకిస్థాన్ సైనికులు జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లోని పూంచ్ జిల్లాలోని షాపూర్, కెర్నీ సెక్టార్లలో కాల్పులకు తెగబడ్డారు. పాక్ సైనికులు జరిపిన కాల్పులను భారత సైనికులు సమర్ధంగా తిప్పి కొట్టారు. ఈ ఘటనలో ఓ భారత జవానుకు …

Read More »