Home / Tag Archives: killed

Tag Archives: killed

మావోయిస్టులతో భీకర ఎన్‌కౌంటర్‌లో..17 మంది జవాన్లు మృతి 14 మందికి గాయాలు

చత్తీస్‌గఢ్‌ బస్తర్‌లోని సుక్మాలో మావోయిస్టులతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో అదృశ్యమైన 17 మంది భద్రతా సిబ్బంది మృతదేహాలను ఆదివారం లభ్యమయ్యాయి. శనివారం మధ్యాహ్నం చింతగుహ అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 14 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులైన వారిని శనివారం రాత్రి రారుపూర్‌కు తరలించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర బగేల్‌ ఆదివారం జవాన్లను పరామర్శించారు. ఎల్మాగుండలో మావోయిస్టులు సంచరిస్తున్నారని, అదేవిధంగా చత్తీస్‌గఢ్‌-తెలంగాణా రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు …

Read More »

మొన్న తల్లిని చంపిన కూతురు.. నిన్న తండ్రిని చంపిన కూతురు

రెండు రోజులు క్రితం నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి అనే కనికరం కూడా లేకుండా ఓ కూతురు క్రూరంగా హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి బెంగళూరులో కేఆర్‌ పురంలోని అక్షయనగర్‌లోని జరిగిన ఘటన మరవకముందే…..తండ్రి తాగుబోతుగా మారాడని కసాయిగా మారిందో కూతురు. పనికి వెళ్లకుండా నిత్యం తాగుతూ ఇంటికి వస్తున్నాడని ఆగ్రహించి అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపేసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. విజ్ఞాన్‌ నగర్‌లో అజ్మర్‌కు చెందిన …

Read More »

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబంలో నలుగురు మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులను శంకర్‌, నరేశ్‌, మేఘవర్షిణి, జ్యోతిగా గుర్తించారు. ప్రమాదం గురించి తెలియగానే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో …

Read More »

కూతుర్ను చంపి కన్న తండ్రి

కన్న కూతుర్నే కర్కశంగా చంపిన తండ్రి ఉదాంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ముంబైలో జరిగిన ఈ పరువు హత్య సంఘటన కాస్త ఆలస్యంగా వచ్చింది. తమ కులం కానీ వాడ్ని ప్రేమించిందనే కోపంతో తిట్వాల్ కు చెందిన అరవింద్ తివారీ (47)అనే వ్యక్తి తన కూతురు ప్రిన్సీ(22)ను అతిదారుణంగా హత్యచేశాడు. శరీరాన్ని ముక్కముక్కలుగా చేసి సూట్ కేసులో దాచాడు. ఆ సూటు కేసును తీసుకుని వెళ్లి థానేకు ఆటోలోనే వెళ్తుండగా …

Read More »

పెద్దపులిని చంపినా…కొండ చిలువను చంపినా..ఒకే రకమైన శిక్ష

‘జాతీయ జంతువు పెద్దపులిని చంపినా… కొండ చిలువను చంపినా.. ఒకే రకమైన శిక్ష తప్పదని, వణ్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవ్వరినీ విడిచి పెట్టేది లేదని శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖాధికారి సందీప్‌ కృపాకర్‌ గుండాల హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల కొండ చిలువలను హతం చేస్తున్న ఘటనలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని కూడా చట్టం ప్రకారం నేరంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు.వణ్యప్రాణి సంరక్షణ …

Read More »

ఏపీలో రోడ్డు ప్ర‌మాదం ఇద్దరు విద్యార్ధులు మృతి

విజ‌య‌న‌గ‌రం జిల్లా రాంభద్రపురం మండలం ఆరికతోట వద్ద ఆదివారం ఉద‌యం రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ట్యాంకర్ లారీ మోటారు సైకిల్ ను ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాదంలో ఇద్దరు విద్యార్ధులు మృతి చెంద‌గా.. ఒకరికి తీవ్ర గాయలు అయ్యాయి. మృతులు వెంకటాపురం వాసులు. ఈమేర‌కు జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళ‌న చేప‌ట్టారు. గంట నుంచి జాతీయ ర‌హ‌దారిపై వాహ‌నాలు నిలిచిపోయాయి.

Read More »

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు మృతి..పలువురు సంతాపం

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు మాధవ్ ఆప్టే ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. 1950వ దశకంలో భారత టెస్టు జట్టులో ఓపెనర్ గా సేవలందించిన మాధవ్, ఏడు టెస్టులు ఆడారు. వెస్టిండీస్ కు చెందిన నాటి దిగ్గజ బౌలర్లు ఫ్రాంక్‌ కింగ్‌, జెర్రీ గోమెజ్‌, ఫ్రాంక్‌ వారెల్‌ …

Read More »

ఘోర ప్రమాదం.. 16 మంది మృతి..సంఖ్య పెరిగే అవకాశం

మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున గోడ కూలిన ఘటనలో దాదాపు 16 మంది మృతి చెందారు. నగరంలోని కొంద్వా ప్రాంతంలోని తలాబ్ మసీదు వద్ద 60 అడుగుల ఎత్తున్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. మృతుల్లో 9 మంది పురుషులు, నలుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య …

Read More »