తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ అయిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఇళంగోవన్ కుమారుడు రాకేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పుదుచ్చేరి నుంచి చెన్నై వస్తుండగా కారు అదుపుతప్పి డివైడరు ఢీకొట్టింది.
ప్రమాదంలో రాకేష్ అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇళంగోవన్ తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన కుమారుడి మరణవార్త తెలియడంతో సీఎం సహా పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.