Home / ANDHRAPRADESH / ఏపీలో రోడ్డు ప్ర‌మాదం ఇద్దరు విద్యార్ధులు మృతి

ఏపీలో రోడ్డు ప్ర‌మాదం ఇద్దరు విద్యార్ధులు మృతి

విజ‌య‌న‌గ‌రం జిల్లా రాంభద్రపురం మండలం ఆరికతోట వద్ద ఆదివారం ఉద‌యం రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ట్యాంకర్ లారీ మోటారు సైకిల్ ను ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాదంలో ఇద్దరు విద్యార్ధులు మృతి చెంద‌గా.. ఒకరికి తీవ్ర గాయలు అయ్యాయి. మృతులు వెంకటాపురం వాసులు. ఈమేర‌కు జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళ‌న చేప‌ట్టారు. గంట నుంచి జాతీయ ర‌హ‌దారిపై వాహ‌నాలు నిలిచిపోయాయి.