Home / Tag Archives: price

Tag Archives: price

నిన్నటి వరకు కిలో రూ. 200 ..ఇప్పుడు రూ. 2 /- టమాటా నేర్పిన గుణపాఠం ఇదే..!

నిన్న మొన్నటి వరకు 200 దాటి సామాన్యుడికి కన్నీళ్లు తెప్పించిన టమాటా…ఇప్పుడు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది..దేశవ్యాప్తంగా నెల రోజుల క్రితం వరకు టమాటా ధర ఆకాశాన్ని తాకింది…కిలో టమాటా ఏకంగా 200 రూపాయలు దాటింది..అసలు టమాటా లేకుండా ఏ కర్రీ ఉండదు…అలాంటిది టమాటా ధర కొండెక్కడంతో సామాన్యులు నానా అగచాట్లు పడ్డారు. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి..టమాటా బంగారం కంటే ప్రియమైపోయిందనే చెప్పాలి..టమాటా ట్రేల దొంగతనాలు …

Read More »

తగ్గిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.390 తగ్గి రూ.55,400కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.430 తగ్గి, రూ.60,430కి చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.200 తగ్గి, రూ.80వేలకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే రేట్లు ఉండనున్నాయి.

Read More »

ఈ ఏడాది పత్తి రైతుల ఇంట సిరుల పంట

ఈ ఏడాది పత్తి రైతుల ఇంట సిరుల పంట పండుతోంది. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో క్వింటాలు పత్తి తాజాగా గరిష్ఠంగా రూ.10,521 పలికింది. ఇది దేశంలోనే అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. వర్షాలకు పంట నష్టపోవడంతో స్పిన్నింగ్ మిల్లుల్లో దూది కొరత ఏర్పడింది. దీంతో ‘ వ్యాపారుల మధ్య పోటీ ఏర్పడి ధర పెరుగుతోంది. మంచి ధర వస్తుండటంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం కన్పిస్తోంది.

Read More »

వాహనదారులపై మళ్లీ పెట్రో పిడుగు

వాహనదారులపై మళ్లీ పెట్రో పిడుగు పడనుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 4 వారాల్లో ఏకంగా 25 శాతం పెరిగి ఏడేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ చుక్కలనంటే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. గతేడాది దేశంలో పెట్రోల్ లీటర్ రూ.110 దాటడంతో వాహనదారులు బెంబేలెత్తారు. తర్వాత కాస్త తగ్గడంతో ఉపశమనం లభించినా.. ఇప్పుడు మళ్లీ రేట్లు పెరిగితే సామాన్యులపై భారం తప్పదు.

Read More »

ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకుల ధరలు

నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. హిందూస్థాన్ యూనీలీవర్ (HUL) తమ ఉత్పత్తులైన వీల్, రిన్, సర్ఎక్సెల్, లైఫ్బయ్ తదితర సబ్బులు, డిటర్జెంట్ల ధరలను 3-20% వరకు పెంచింది. సర్ఎక్సెల్ సబ్బు రూ.10 నుంచి రూ.12, లైబ్బాయ్ రూ.29 నుంచి రూ. 31, కిలో వీల్ పౌడర్ రూ.60 నుంచి 62, రిన్ బండిల్ రూ.72 నుంచి రూ.76కు పెరిగాయి. ఇక గోధుమ పిండి ధర 5-8 శాతం, బాస్మతి బియ్యం …

Read More »

మళ్లీ పెరిగిన  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

 పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. లీట‌ర్ పెట్రోల్‌పై 36 పైస‌లు, డీజిల్‌పై 38 పైస‌లు పెంచారు. దీంతో హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర రూ. 109.73 కాగా, డీజిల్ ధ‌ర రూ. 102.80గా ఉంది. పెట్రోల్ ధ‌ర‌లు అమాంతం పెరిగిపోవ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెంచ‌డం వ‌రుస‌గా ఇవాళ నాలుగో రోజు. అన్ని రాష్ట్రాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 100పైనే ఉన్న‌ది.

Read More »

మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు

గ్యాస్‌ సిలిండర్‌ ధరలు మళ్లీ పెరిగాయి. పదిహేను రోజుల వ్యవధిలో సిలిండర్‌ ధరలు పెరగడం ఇది రెండోసారి. గత నెల 17న గ్యాస్‌ బండ ధరలు పెంచిన చమురు కంపెనీలు మరోసారి వినియోగదారులపై భారం మోపాయి. గృహావసరాలకోసం వినియోగించే నాన్‌ సబ్సిడీ సిలిండర్‌ ధరను రూ.25 పెంచాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.884.50కు పెరిగింది. అదేవిధంగా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 …

Read More »

ఐఫోన్ 13 ఫీచర్స్ ఇవే..?

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఆపిల్ ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 13 స్పెషల్ వైర్లెస్ ఛార్జింగ్తో రానుందట. పోర్టెయిట్ వీడియో ఫీచర్ ఉంటుందట. ఇక ఐఫోన్ 13 సెప్టెంబర్లో లాంచ్ అవ్వనుందని తెలుస్తోంది. ఐఫోన్ 13 వస్తోన్న నేపథ్యంలో.. ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ 12 బేసిక్ మోడల్పై సుమారు రూ.9000 …

Read More »

ఖమ్మం మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలికిన పత్తి

 ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటకు రికార్డు స్థాయిలో ధర పలికింది. సోమవారం జరిగిన ఆన్‌ లైన్‌ బిడ్డింగ్‌ లో ఖరీదుదారులు మొదటి రకం పంటకు క్వింటాకు రూ.7,250 చొప్పున బిడ్‌ చేశారు. తెల్ల బంగారానికి అత్యధిక ధర పలకడం ఇదే తొలిసారి అని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. కొద్ది రోజుల నుంచి సుమారు నెల రోజుల నుంచి లాక్‌ డౌన్‌ కారణంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల …

Read More »

వాహనదారులకు భారీ షాక్

బ్రేక్ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ లీటర్కు 26 పైసలు, డీజిల్ లీటర్కు 34 పైసలు పెంచాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.95.13కు చేరగా డీజిల్ ధర రూ.89.47గా ఉంది. వ్యాట్ ఎక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ధరలు రూ.100 దాటాయి. కొవిడ్ సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat