ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు దుష్టపాలన.. ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలు.. ఓట్లేసి గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించమని భాద్యతలని చంద్రబాబుకు ఇస్తే.. బాబు రైతులని.. ప్రజలని.. డ్వాక్రా మహిళలని ఎలా మోసం చేస్తున్నాడో అందరికి తెలిసేలా.. రాష్ట్ర ప్రజలకు వివరించేలా జగన్ పాదయాత్ర చేపడుతానని ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే పాదయాత్రని ముందుగా అక్టోబర్‌లో స్టార్ట్ చేయాలని అనుకున్నా.. కొన్ని కారణాలవలన నవంబర్ 2కి మారింది. అయితే ఈ గ్యాప్‌లో జగన్ చేయబోయే పాదయాత్ర ఎలా ఉండాలి.. ఎక్కడ నుంచీ ప్రారంభించాలి.. ఏ ఏ ప్రాంతాలు కవర్ చేయాలి అనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి.
నవంబరు 2న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి జగన్ మహాపాదయాత్ర మొదలుకానుంది. దీనికి ఒక రోజు ముందు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని ఆ తర్వాత తిరుమల నుంచి ఇడుపులపాయకు వెళ్లి.. అక్కడ నుంచి తన పాదయాత్రను ప్రారంభించనున్నారని సమాచారం. జగన్ మహా పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను వైసీపీ ఎన్నికల వ్యూహకర్త పక్కా ప్రణాళికలతో ఫిక్స్ చేశారని.. జగన్ పార్టీ నేతలు వెల్లడించారు. జగన్ ముందుగా కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం చివరగా శ్రీకాకుళం జిల్లా సరిహద్దు ఇచ్ఛాపురంతో తన పాదయాత్రను ముగించనున్నారు. సుదీర్ఘంగా సాగనున్న జగన్ పాదయాత్ర కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి జగన్ చేసే ఈ పాదయాత్ర సక్సెస్ అవుతుందా అందుకు తగ్గట్టుగా పీకే ఏమి ప్లాన్ చేశాడు.. పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చే హామీలపై కసరత్తులు చేస్తున్నారని సమాచారం.