తెలంగాణ రాష్ట్ర౦లో టీడీపీ పార్టీ అడ్రస్ లేకుండా పొయింది అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అయినా, ఇక్కడున్న కొందరు టీడీపీ నేతలు రోజూ ఆరోపణలు చేస్తున్నారని వారిపై మండిపడ్డారు. టీడీపీ దివంగత నేత పరిటాల రవి కుమారుడి పెళ్లికి కేసీఆర్ వెళ్లిన అంశంపై విలేకరులు ప్రశ్నించగా.. పరిటాల రవి తనకు చాలా మంచి మిత్రుడని అన్నారు. మిత్రుడి కొడుకు పెళ్లికి వెళితే తప్పేంటి? అని కేసీఆర్ ప్రశ్నించారు. గతంలో తాను అనంతపురం జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
