ఏపీలో అధికార టీడీపీలోకి వలసలను ప్రోత్సహించే విషయంలో పచ్చ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నంద్యాల ఉప ఎన్నిక తర్వాత అనేక మంది వైసీపీ నేతలు టీడీపీలోకి చేరుతున్నారని తప్పుడు కథనాలు ప్రచురించిని ఎల్లో మీడియా వారు.. తాజాగా కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలోకి చేరనున్నారని కథనాలు ప్రచురించారు. అయితే ఈ కథనాలపై ఆమె స్పందించారు. తాను టీడీపీలో చేరడం లేదని.. వైసీపీలోనే కొనసాగుతానని.. ఆ వార్తలు అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు. జగన్‌తో తనకు ఎలాంటి ఇబ్బందులూ లేవని, వైసీపీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నానని చెప్పారు.
అయితే కావాలనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జగన్ పాదయాత్ర చేపట్టేలోగా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు టిడిపిలో భారీ సంఖ్యలో చేరతారంటూ టీవీ ఛానళ్లలోనూ, సోషల్ మీడియాలోనూ కథనాలు వెలువడ్డాయి. బుట్టా రేణుకతో పాటు కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, అనంతపురంకు చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీలో చేరతారని వార్తలు వెలువడ్డాయి. అయితే తాను టీడీపీలో చేరుతున్నట్టు ఓ పథకం ప్రకారం కొంతమంది ప్రచారం చేస్తున్నారని.. టీడీపీ నాయకులు తమ తోక పత్రికలు, టీవీ చానళ్ల ద్వారా అసత్య ప్రచారాలు మానుకోవాలని బుట్టా రేణుక సూచించారు.