ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర౦లోని ఏలూరు జిల్లా నుంచి పీసీసీ సభ్యుడిగా రాజ్య సభ సభ్యుడు చిరంజీవి నియమితులయ్యారు. జిల్లాల వారీగా పీసీసీ సభ్యులను నియమిస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 17 మంది సభ్యులను నియమించారు. ముందుగా కొవ్వూరు బ్లాక్–1 పీసీసీ సభ్యురాలిగా కాపవరం పంచాయతీ సర్పంచ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ఎండీ.అమరజహా బేగ్‌ను నియమించారు.అయితే రాజ్య సభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా నుంచి పీసీసీ సభ్యుడిగా స్థానం కావాలని కోరడంతో అమరజహా బేగ్ తన స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించాలని సూచించారు. దాంతో చిరంజీవిని కొవ్వూరు బ్లాక్–1 పీసీసీ సభ్యుడిగా నియమించారు.
