తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు, అవసరమైన ముడిసరుకులను దిగుమతి చేసుకొనేందుకు రెండు లాజిస్టిక్స్ పార్కులను పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేసారు . హైదరాబాద్ – విజయవాడ హైవేపై రూ.35 కోట్ల వ్యయంతో బాటసింగారంలో 40 ఎకరాల విస్తీర్ణంలో ఒకటి, నాగార్జున సాగర్ హైవేపై రూ.20కోట్లతో మంగళ్ పల్లిలో 20 ఎకరాల్లో మరో పార్క్ ను నిర్మిస్తున్నారు. పబ్లిక్ – ప్రైవేట్ (PPP) భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ లాజిస్టిక్ పార్కులకు ఈ రోజు మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు పథకాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు, అవసరమైన ముడిసరుకులను దిగుమతి చేసుకొనేందుకు రెండు లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. బాటసింగారం పనులను క్రెడాన్స్ లాజిస్టిక్స్ కంపెనీ, మంగళ్‌పల్లి పనులను కేసీపీ ప్రాజెక్ట్స్ దక్కించుకున్నాయి. రెండేళ్లలో 60శాతం పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మూడేళ్లలో పూర్తి కానున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా లక్ష మందికి ఉపాధి లభించనుంది.