ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను పుట్టిన ఊరు వాద్‌నగర్‌ను ఆదివారం సందర్శించారు. ఆయన ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత తన స్వస్థలాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన మనసు భావోద్వేగంతో ఉత్తేజితమైంది. తాను పుట్టిన గడ్డకు మోకరిల్లి నమస్కరించారు. నేలపైనున్న కాస్త మట్టిని తీసుకుని నుదుటికి తిలకంగా దిద్దుకున్నారు. ఆయన ఇదే గ్రామంలో చదువుకున్నారు.
