ఏపీలో ఏకంగా అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే పైనే ఆ పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్ళు దాడికి దిగారు .అంతే కాకుండా ఏకంగా సాక్షాత్తు ఎమ్మెల్యే సాక్షిగా తమ్ముళ్ళు తన్నుకున్నారు .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో గుంతకల్లు పట్టణంలో ఈ రోజు రెండో వార్డులో ఇంటింటికీ తెలుగు దేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు .
ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కౌన్సిలర్ అయిన గుణశేఖర్ ,మాజీ ఎంపీటీసీ మస్తానమ్మ వర్గీయులు ఒకరిపై మరొకరు పరస్పర దాడులకు దిగారు .అయితే అక్కడే ఉన్న ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేయడానికి ప్రయత్నించాడు .అంతే ఎమ్మెల్యే అని చూడకుండా ఇరు వర్గాలకు చెందిన వారు పరస్పర దాడులు చేసుకుంటూ ..ఎమ్మెల్యే పైకి కూడా దాడికి దిగారు .
తమకు అడ్డు ఉన్నారు అనే కారణంతో ఆయన్ని పక్కకు నెట్టేశారు.అంతే కాకుండా ఆ ఎమ్మెల్యే కిందపడటంతో సదరు ఎమ్మెల్యేకు గాయాలు అయ్యాయి .ఆయన్ని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి చేర్చారు .