తెలంగాణ సీఎం ,రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో పర్యటించారు .ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు .అంతే కాకుండా జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు తన చేతుల మీదుగా అందజేశారు .
అనంతరం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో పాల్గొన్నారు .ఈ సభలో సీఎం మాట్లాడుతూ “తమ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి లక్షమంది ఉత్తమ్ కుమారులు అడ్డొచ్చిన ఆగదు .అది నిర్మించే తీరుతాం .నల్గొండ జిల్లా ప్రజల సమస్యలను తీరుస్తాం అని ఉద్ఘాటించారు .అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేనా ..టీడీపీ ఎమ్మెల్యేనా అని అలోచించలే ..ప్రజలంతా మావాళ్ళే అనే భావనతో ముందుకు పోతున్న .రాష్ట్రంలో ఏ ఊరు అయిన ఏ పల్లె అయిన తండా అయిన నాదే .
తెలంగాణలో ప్రతి ఇంచు గురించి నాకు తెలుసు .నారక్తాన్ని బొట్టు బొట్టుగా రంగరించి మీకు న్యాయం చేస్తా అని స్పష్టం చేశారు .జిల్లాలో ఉన్న ప్రతి గ్రామపంచాయితీకి పదిహేను లక్షలు ..ప్రతి తండాకు పది లక్షలు కేటాయిస్తా అని..రేపే జీవో జారి చేయిస్తా అని అన్నారు .అయితే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కొంతమంది తమ పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి చెందుతుంది .ప్రజలకు మేలు జరుగుతుంది అని బెదిరించిన నేతలున్న ప్రస్తుత రోజుల్లో ఎమ్మెల్యే ఏ పార్టీ వారు అయిన కానీ వాళ్ళు నావాళ్ళు అనుకునే రాష్ట్ర అభివృద్ధి చేస్తున్న ..చేస్తా ..మీకు న్యాయం చేస్తా అని ప్రకటించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల మదిని దోచుకున్నారు .