ఉమ్మడి ఆంధ‌్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాలన సువర్ణాధ్యాయం..వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల ఫలాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుభవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు..ముఖ్యంగా 108, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ పథకాలతో పేదల పాలిట ఆపద్భాంధవుడిగా నిలిచారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రైతులకు రుణాలు, జలయజ్ఞంతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి, వ్యవసాయానికి సాగునీరు అందించి రైతు బాంధవుడిగా నిలిచారు. వైఎస్ 80 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని, వ్యవసాయ రంగానికి ఎంతో సేవ చేశారని సాక్షాత్తు తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కొనియాడరంటే వైఎస్ పాలన ఎంత గొప్పగా సాగిందో చెప్పవచ్చు. ముఖ్యంగా వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసన్ లాంటి ఉన్నత చదువులు ఉచితంగా చదుకుని ఇప్పుడు మంచి ఉద్యోగాలలో సెటిలయ్యారు.అందుకే మహానేత వైఎస్‌ని విద్యార్థులు దేవుడిలాగా కొలుస్తున్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ ద్వారా ఉన్నత చదువులు చదువుకుని విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులు మాత్రం వైఎస్‌ను మాత్రం మర్చిపోలేదు..ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఏపీ విద్యార్థులు తమ ప్రియతమ నేత వైఎస్ఆర్ రుణం తీర్చలేనిదనడానికి నిదర్శనంగా మక్కాలో ఓ కార్యక్రమం జరిగింది.
చేసేది సాఫ్ట్ వేర్ ఉద్యోగం అది కూడా మన దేశం లో కాదు. కానీ దేశాలు మారినా రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కొంచెం కూడా తగ్గలేదు. అందుకే విదేశాల్లో ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూను జగన్ కోసం టీమ్‌గా ఏర్పడి పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా వై ఎస్ జగన్ చెయ్యబోయే పాదయాత్ర ఎటువంటి ఆటంకం కలగకుండా జరగాలని, ఆయనకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతూ ముస్లింల పవిత్ర స్థలమైన మక్కా మజీదులో పవిత్ర ప్రార్థనలు నిర్వహించారు జగన్ కోసం టీమ్ సభ్యులు.
జగన్ కోసం టీమ్ సభ్యుడు షేక్ సలీం మాట్లాడుతూ జగనన్న చేయబోయే పాదయాత్రకు ఎటువంటి ఆటంకాలు రాకుడదని, ఆయన చేపట్టబోయే పాదయాత్రలో ఆయనకు అల్ల్హా ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, జగనన్న కోరుకున్నట్టు ఈ పాదయాత్ర విజయవంతం కావాలని నేను నా ఫ్రేండ్స్ తో కలిసి మా ఆరాధ్య ప్రదేశం మస్జిద్ ఎ మక్కాలో ప్రత్యేకంగా ప్రార్ధనలు చేసి, పవిత్ర ఉమ్రా కూడా చేసి ఆ తరువాత మేము చేసిన అన్ని నమాజుల పుణ్యం మైనార్టీలకు తోడుగా నిలిచే జగనన్నకు దక్కాలని దువా చేసుకోనే కార్యక్రమం కూడా చేసాము. ఈ ప్రార్థనలు కూడా నాకు అత్యంత ఆప్తులైనటువంటి మతగురువుల సలహాలను, సూచనలను తీసుకోని వారు చేప్పిన విధంగా నియమ పద్దతులను పాటించి జగనన్నకు మద్దతుగా ఉమ్రా చేసాము. మక్కాలో ఉండే కాబాలో జగనన్న ఫోటొలతో ప్రార్థన చేయడం నిషేధమైనప్పటికి ఆ రాజన్న ప్రవేశపేట్టిన ఫిజు రీయింబర్స్‌మెంట్ తో చదువుకొని ఈ రోజు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి గుండెల నిండా పెద్దాయనను నింపుకొని ప్రార్థనలు చేసాము అని చెప్పారు.జగనన్న పాదయాత్రలో ఉన్నప్పుడు మరలా ప్రార్థనలు చేసి, పవిత్రమైనా జమ్ జమ్ నీటిని, అజ్వా ఖర్జురపండును త్వరలో జగనన్నను కలిసి అందిస్తామని జగన్ కోసం సభ్యులు తెలిపారు, కులమత బేధం లేకుండా వైఎస్ఆర్ తన పథకాలతో ఎందరినో చదివించాడు ఎన్నో ప్రాణాలుకాపాడారు. ఆ అభిమానమే ఇక్కడ నుండి మక్కా మస్జీద్ వరకు వెళ్లి జగన్ కోసం ప్రార్ధనలు చేసేలా చేసింది. ఈ కార్యక్రమంలో షేక్ సలీం, మహమ్మద్ షబ్బీర్ , షేక్ సిరాజ్ , మహమ్మద్ అల్తాఫ్, షేక్ ఖాజవలి, ఇర్షాద్, షేక్ ఫరిద్ మరికొంతమంది పాల్గొన్నారు. ఏపీలో ముస్లిం వర్గాలు వైఎస్‌ను ఆరాధ్యదైవంగా కొలుస్తాయి..ముస్లింల సంక్షేమానికి వైఎస్ ఎంతగానో కృషి చేశారు. అందుకే ముస్లిం విద్యార్థులు వైఎస్ఆర్ తనయుడు జగన్‌కు ఫాలోయర్స్‌గా మారిపోయారు. వచ్చే ఎన్నికల్లో జగన్ అన్నను గెలిపించుకుని మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకోవాలని ముస్లింలు భావిస్తున్నారు. ముస్లింల హృదయాల్లో వైఎస్, ఆయన తనయుడు జగన్ ఎంతగా గూడుకట్టుకుని ఉన్నారో ఈ కార్యక్రమం రుజువు చేసింది.మొత్తంగా పవిత్ర మక్కాలో ముస్లిం యువకులు జగన్ కోసం ప్రార్థనలు చేయడం ఏపీలో సంచలనంగా మారింది.