పిర్యాదు చేయడానికెళ్ళిన యువకుడికి పోలీసులు సడెన్ సర్ ప్రైజ్….
rameshbabu
October 15, 2017
NATIONAL, SLIDER
1,506 Views
- ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓయువకుడికి అనుకోని సర్‌ప్రైజ్ ఎదురైంది.ముంబయికి చెందిన అనీశ్ అనే యువకుడు శనివారం ఫిర్యాదు చేయడానికి స్థానిక సకినక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ కంప్లైంట్ రాస్తూ తన వివరాలన్నీ పేర్కొన్నాడు. అక్కడి ఎస్సై అనీశ్ రాసిన ఫిర్యాదుని చదివి అతన్ని కాసేపు కూర్చోమని చెప్పి బయటకు వెళ్లాడు. తనని ఎందుకు కూర్చోమన్నారో అర్థం కాక అనీశ్ తెగ భయపడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అంతా కలిసి అనీశ్‌కు కేక్ తెప్పించి సర్‌ప్రైజ్ చేశారు. అదే స్టేషన్‌లో అనీశ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ ఫొటోలను ముంబయి పోలీసులు అధికారిక ట్విటర్ పేజ్‌లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ పెట్టిన కొద్దిసేపటికే 1000కిపైగా లైక్‌లు 200లకు పైగా రీట్వీట్లు వచ్చాయి. పోలీసులు ఇలా స్నేహపూర్వకంగా ఉంటే ప్రజలు కూడా ధైర్యంగా ఉంటారంటూ నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు.
Post Views: 444